Thu. Jul 25th, 2024
What is the secret behind Hyderabad city building Charminar?

హైదరాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్. అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలాగో పారిస్ కి ఐఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కి చార్మినార్ అలాగన్నమాట హైదరాబాద్ కి వచ్చే సందర్శకులు చార్మినార్ ను తప్పకుండా సందర్శిస్తారు. చార్మినార్ ను కట్టి కొన్ని శతాబ్దాలు గడిచిన ఇప్పటికీ ప్రజలను ఆకర్షించేంత అందం చార్మినార్ సొంతం ఇంత అందంగా సోబాగులు అద్దిన చార్మినార్ను నిర్మించింది ఎవరు? అసలు చార్మినార్ను ఎందుకు నిర్మించారు? దీని వెనక రహస్యం ఏమిటి? చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు సొరంగమార్గం ఉందా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ విలువైన సలహాను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

 

What is the secret behind Hyderabad city building Charminar?
What is the secret behind Hyderabad city building Charminar?

 

చార్మినార్ అనగా రెండు పదాల కలయిక చారు అనగా 4 మినార్ అనగా టవర్ అలా నాలుగు బినారులతో నిర్మించిన మినార్లతో నిర్మించిన ఈ కట్టడానికి చార్మినార్ అని పేరు పెట్టడం జరిగింది.1550 వ సంవత్సరంలో గోల్కొండ రాజ్యానికి ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజుగా పరిపాలన ఆరంభించాడు. గోల్కొండ సంస్థానానికి రాజయ్యాక గోల్కొండ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేయడం ఆరంభించాడు. గోల్కొండ కోట సంస్థానాన్ని క్రీస్తు శకం 1143లో కాకతీయులు నిర్మించారు అప్పుడు జనాభా చాలా తక్కువగా ఉండేది కాబట్టి జనాభాకు తగ్గట్టుగానే సంస్థానాన్ని నిర్మించారు కానీ 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ గోల్కొండ సంస్థానం ఇబ్రహీం కులీ కుతుబ్షా చేతిలోకి వచ్చేసరికి జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దాంతో ఇబ్రహీం కులీకుతుబ్షా తన రాజ్యాన్ని ఎంతలా అభివృద్ధి చేద్దామనుకున్నా కుదరలేదు కోటలోపల ప్రజల కొరకు ఇల్లు నిర్మించడం అసాధ్యం ఎందుకంటే రాజ్యంలో ప్రజలందరికీ ఇల్లు లేవు ప్రజలు పూరిగుడిసెలలో నివసిస్తున్నారు. ఇబ్రహీం కులీ కుతుబ్షా పక్కనే మరొక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు అనువైన ప్రదేశం కోసం తన అధికారులను చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాలని అలాగే పరిశీలించాలని  ఆదేశించాడు అధికారులు పరిశీలించగా చివరికి మూసి నది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉందని ఆ ప్రాంతం నివాసయోగ్యం కలదని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చని రాజుకు నివేదించారు దాంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆ ప్రాంతంలో నగరం నిర్మించేందుకు అనుమతి ఇచ్చాడు గోల్కొండ సంస్థానానికి కొత్త నగరానికి మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్లు అలాగే మధ్యలో మూసి నది ప్రవహిస్తూ ఉంది.మూసి నదిపై వంతెన నిర్మించారు ఆ వంతెన పేరే పురనాపుల్ వంతెన. వంతెన నిర్మించిన అనంతరం నూతన నగరాన్ని నిర్మించేందుకు ఆర్కిటెక్ట్ల కోసం వివిధ సంస్థానాలలో వెతకగా ఇరాక్ దేశంలోని ఇస్తరాబాదులో ఎంతో పేరు గడిచిన విద్యావేత్త ప్రముఖ ఆర్కిటెక్ మీర్ మోమిన్ ను కలిశారు. ఆయనతో సంప్రదించాక నూతన నగరానికి తన వంతు కృషి చేస్తానని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పాడు ఆయనను గోల్కొండ ఆస్థానానికి తీసుకొని వచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను గమనించిన ఇబ్రహీం కులీకుతుబ్షా అతని ప్రతిభకు ముగ్ధుడై తన ప్రధానిగా నియమించుకున్నాడు. నూతన నగర నిర్మాణ బాధ్యతను ప్రధాని మీర్ మోమిన్ కు అప్పగించాడు దాంతో మీరు మీర్ మోమిన్ మూడేళ్ల పాటు నిరంతరం ఎన్నో ప్రణాళికలు రచించి ఎంతో మందిని సంప్రదించి ఎన్నో సలహాలు స్వీకరించి నూతన నగర నిర్మాణ బ్లూ ప్రింట్ ని రెడీ చేసి రాజుకి సమర్పించాడు. బ్లూ ప్రింట్ ని చూసిన రాజు కులికుతుబ్షా బాగా పరిశీలించి నూతన నగరం ఎంతో అద్భుతంగా ఉందని మరింత అద్భుతంగా ఉండాలని ఎన్నో మార్పులు చేశారు అంతేకాదు ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాలలో ఉండే అద్భుత సౌకర్యాలు అన్ని కూడా నూతనగరంలో ఉండాలని అధికారులను ఆదేశించాడు.

అలా నూతన నగర నిర్మాణం ఆరంభించారు ఆ నూతన నగరమే ప్రస్తుతం మనందరం తిరుగుతున్న హైదరాబాద్ నగరం. నూతన నగరాన్ని ఇరాన్ దేశంలోని నగర నమూనాని పోలి ఉంటుంది నూతన నగరం పూర్తయ్యాక గోల్కొండ నుండి హైదరాబాద్ నగరానికి తన రాజ్యాన్ని మార్చాడు ఇదే సమయంలో దేశం తో పాటు గోల్కొండ రాజ్యంలో కూడా కలరా తీవ్రంగా వ్యాపించింది. కలరా విస్తృతంగా వ్యాపించడంతో గోల్కొండ రాజ్యంలో చాలామంది మరణించారు. కలరా వ్యాధి పూర్తిగా నిర్మూలింపబడితే తన రాజ్యంలో ఒక కట్టడం కడతానని దేవుడికి మొక్కుకున్నాడు కలరా వ్యాధి తగ్గడంతో 1591లో చార్మినార్ నిర్మాణం ప్రారంభించాడు. చార్మినార్ అనేది ఇరాక్ దేశంలోని ఇమామ్ ఆలీ రాజు సమాధి మాదిరిగానే నాలుగు స్తంభాలు ఉండేలా నిర్మించాడు. చార్మినార్ను 1591 లో మొదలుపెట్టి 1592 సంవత్సరంలోనే పూర్తి చేశారు కేవలం ఒకే ఒక సంవత్సరంలోనే పూర్తి చేశారు. కానీ కొన్ని గ్రంథాలలో పుస్తకాలలో 1589లో ప్రారంభించగా 1592లో పూర్తయిందని రాయబడి ఉంది ఏది ఏమైనప్పటికీ 1592లో చార్మినార్ నిర్మాణం పూర్తవగా నూతన నగరంలో అది ఒక ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. నేటికీ హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ను భాగ్యనగరం అనే పిలవడం మనందరికీ తెలుసు కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నగరానికి దగ్గర్లోనే అప్పట్లో చించలం అనే గ్రామం ఉండేది ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని శాలిబండగా పిలుస్తున్నారు ఈ గ్రామంలోనే భాగమతి అనే అద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయి ఉండేది మహమ్మద్ కులీ కుతుబ్షా భాగమతి సౌందర్యానికి ముగ్ధుడై ఆమెతో ప్రేమలో మునిగిపోయాడు ఆమె పేరుకు గుర్తుగా నూతనంగా నిర్మించిన నగరానికి భాగ్యనగరం అనే పేరు పెట్టాడు. ఆమెను వివాహం చేసుకున్నాక ఆ భాగమతి పేరును హైదర్ మహల్ గా మార్చాడు ఆమె పేరును భాగమతి నుండి హైదర్ మహల్ గా ఎలా అయితే మార్చాడో అలాగే నూతన నగరం పేరును భాగ్యనగరం నుండి హైదరాబాద్ గా మార్చాడని చరిత్రకారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర కేంద్రంగా కలరా వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించిన చార్మినార్ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చార్మినార్ నిర్మించి నేటికీ 431 సంవత్సరాలు గడిచింది దీని నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు చార్మినార్ ను ఏ వైపు నుండి చూసినా నాలుగు మీనార్ లు కనిపించేలా నిర్మించారు. చార్మినార్కు ఆర్ పేరు పెట్టడానికి కేవలం నాలుగు మీనార్ లు ఉండడం కాదని 20 కారణాలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

చార్మినార్ నిర్మాణంలో ఉన్న ప్రతి విషయం నాలుగు అంకెతో సంబంధం కలిగి ఉందని చార్మినార్ 40 నలభై ముఖాలను నాలుగుతో బాగించవచ్చని అలాగే నాలుగు మినార్ల ఎత్తు 60 గజాలని నాలుగుతో భాగించవచ్చని ఈ నిర్మాణం నాలుగు రోడ్ల కూడలిలో ఉందని అలాగే ఈ నిర్మాణంలో నాలుగు వైపులా నాలుగు గడియారాలు 1889లో లండన్ నుండి తెప్పించి బిగించారని అలాగే ప్రతి మీనార్ లోనూ నాలుగు గ్యాలరీలు ఉన్నాయని అంతేకాకుండా చార్మినార్ లో ఒక మసీదు ఉందని అందులో కూడా నాలుగు మినార్లు ఉన్నాయని అలాగే ప్రతి మినార్లు 140 మెట్లు ఉన్నాయని అర్చన రూపకర్పణలో ఆర్చ్ ల రూపకల్పనలో మెట్ల నిర్మాణంలో నాలుగు అనే నంబర్ సంఖ్య దర్శనం ఇస్తుందని అంతేకాదు చార్మినార్ నిర్మించిన కులీ కుతుబ్ షా కూడా నాలుగవ కుతుబ్షాహీ వారసుడినని ఇలా ప్రతిదీ ఈ నిర్మాణంలో నాలుగు నెంబర్తో సంబంధం కలిగి ఉందని ఉండటం వల్ల ఈ నిర్మాణానికి చార్మినార్ అనే పేరు పెట్టడం జరిగిందని కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కొన్ని శతాబ్దాలు గడిచిన చార్మినార్ చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం దాని నిర్మాణంలో పాటించిన శాశ్వత నాణ్యత అని పరిశోధకులు ఆశ్చర్యపోయి చెబుతున్నారు అలా నిర్మించడం ఎలా సాధ్యం అని తెలుసుకునేందుకు VIT యూనివర్సిటీ వారు పురావస్తు శాఖ వారి సహాయంతో రంగంలోకి దిగారు అనేక పరిశోధనలు చేశారు చార్మినార్ ఫినిషింగ్లో పైపూతగా పూసిన సున్నపురాయి వలన ఈ కట్టడం ఇంతకాలం పటిష్టంగా ఉందని తేల్చి చెప్పారు. సున్నపురాయితోపాటు ఇసుక కంకర నీళ్లను కలిపి వెదురు మొక్కల గుజ్జును సేకరించి వీటితో పాటు కలిపి ఈ పదార్థాన్ని చార్మినార్ పై పూతగా వాడినట్టు పరిశోధకులు తెలియజేశారు చార్మినార్ నిర్మాణంలో గ్రానైట్ సున్నపురాళ్ళు మోటార్ మేటర్ పల్వర్జ్తో పాడరాయిని వాడటం జరిగింది. అందువలననే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం అంత దృఢంగా ఉందని తెలియజేశారు. ఆనాడు నాణ్యతను పాటించారే కానీ లాభాపేక్షను చూడలేదని అర్థం అవుతుంది. నేటి తరంలో అంత నాణ్యమైన కట్టడం అసాధ్యం అని చాలామంది చెబుతుంటారు. కులి కుతుబ్షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుండి చార్మినార్కు దాదాపు పది కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ఉందని చెబుతున్నారు ఆ మధ్య తవ్వకాలలో సొరంగ మార్గానికి సంబంధించిన మెట్టు కూడా బయటపడ్డాయి ఏదైనా అనుకుని విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ సొరంగ మర్గం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా దీనిని దీనిని నిర్మించినట్లుగా చెబుతున్నారు అయితే సురంగ మార్గం ఎలా ఎక్కడ నుండి ఉందో స్పష్టంగా ఎవరు గుర్తించలేకపోయారు.మీరు బ్రాస్లెట్ కోసం చూస్తున్నట్లయితే. బాడీ హగ్గింగ్ నుండి స్ట్రక్చర్డ్ వరకు, కఫ్‌ల నుండి చైన్ chain bracelet మరియు కఫ్‌ల వరకు ప్రతి రూపానికి సరిపోయేవి ఉన్నాయి.

కానీ 2022 ఫిబ్రవరిలో చార్మినార్ వద్ద జరిపిన తవ్వకాలలో ఈ సొరంగ మార్గం బయటపడిందని వార్తలు వచ్చాయి ఇందులో మెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు అయితే అధికారులు దీనిని తిరిగి  పూడ్చివేసినట్లుగా పేర్కొన్నారు. చార్మినార్ ను అనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రాంతంలోనే చార్మినార్ నిర్మించారని చాలామంది బలంగా నమ్ముతున్నారు ఈ ఆలయం పేరు మీదుగానే హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అనే పేరు ఉండేదని దానిని హైదరాబాద్ నగరంగా మార్చారని నమ్ముతున్నారు. అయితే  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మాత్రం ఈ ఆలయ నిర్మాణం తర్వాత జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ కి తలమానికంగా నిర్మించిన చార్మినార్ నాలుగువైపులా షాపింగ్ కాంప్లెక్స్లు ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండవు మట్టి గాజులు అత్తరు సెంటు సీసాలు మొదలుకొని మెటల్ గాజుల దాకా ఐదు రూపాయల నుండి మొదలుకొని పదివేల రూపాయల వరకు అన్ని రకాల గాజులు దొరుకుతాయి అలాగే చార్మినార్ ప్రాంతంలో ముత్యాలు చాలా ఫేమస్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ప్రజలందరూ చార్మినార్ ప్రాంతంలోనే షాపింగ్ చేస్తారు. రంజాన్ మాసంలో ఇక్కడ నైట్ బజార్ ఉంటుంది రాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. చార్మినార్ చుట్టుపక్కల దాదాపు 1500 షాపులు పైగా ఉన్నాయి ఇంత అద్భుతమైన చార్మినార్ను సందర్శించడానికి విదేశీయులు సైతం వస్తూ ఉంటారు చార్మినార్ హైదరాబాద్ అందానికి వన్నెతెచ్చిందని చెప్పవచ్చు హైదరాబాద్ వెళితే ఈసారి చార్మినార్ను తప్పకుండా సందర్శించి ఆనందించండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *