Sat. Jul 27th, 2024
Madras High Court stays release of Vishal and SJ Suryah starrer Mark Antony?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ కొత్త సినిమా ‘మార్క్ ఆంటోని’ సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ‘మార్క్ ఆంటోని’ విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక ఫైనాన్స్‌ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించిన కోర్టు మార్క్‌ ఆంటోనీ రిలీజుపై స్టే విధించింది.దీంతో కోలీవుడ్ హీరో విశాల్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నటుడు విశాల్‌పై కేసు నమోదు చేసింది. లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ 21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ చెల్లింపులు చేయకపోవడంతో 15 కోట్లను నిర్ణీత గడువులోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే విశాల్ 15 కోట్లు చెల్లించకపోవడంతో ఇప్పుడు ‘మార్క్ ఆంటోని’ విడుదలపై కోర్టు స్టే విధించింది. అంతేకాదు సెప్టెంబర్ 12న విశాల్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్ 15న ఇతర తమిళ లేవీ విడుదల కాకపోవడంతో ‘మార్క్ ఆంటోని’ని సోలోగా విడుదల చేయాలని భావించారు మేకర్స్‌. దీంతో కు భారీ కలెక్షన్లు వస్తాయని అంతా భావించారు. అయితే కోర్టు ఆదేశాలతో చివరి క్షణంలో చిత్ర బృందం ప్లాన్‌ రివర్స్‌ అయింది. సెప్టెంబర్ 15లోగా విశాల్ 15 కోట్లు చెల్లిస్తే కోర్టు విధించిన స్టే ఎత్తివేసే అవకాశం ఉంది.

Madras High Court stays release of Vishal and SJ Suryah starrer Mark Antony?
Madras High Court stays release of Vishal and SJ Suryah starrer Mark Antony?

కాగా విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ విషయంలో విభేదాలు ఉన్నాయి. గోపురం చేయడానికి ఫిలింస్టోకు చెందిన అన్బుచెలియన్ నుండి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు విశాల్‌. దీనిని నిర్మాణ సంస్థ లైకా చెల్లించింది. అయితే విశాల్ లైకాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. పైగా ఇచ్చిన హామీలు, అగ్రిమెంట్లను కూడా విశాల్ ఉల్లంఘించాడు. దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది నిర్ణీత గడువులోగా 15 కోట్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే విశాల్ ఆ మొత్తాన్ని ఇవ్వలేదు. ‘మార్క్ ఆంటోని’ లో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య కూడా నటించాడు. రీతూ వర్మ ఈ సినిమాలో లో కథానాయిక. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. టైమ్‌ ట్రావెల్‌కు సైన్స్‌ ఫిక్షన్‌ను జోడించి ఈసినిమాను రూపొందించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కామెడీ కూడా క్లిక్ కావడంతో ఈ పై చిత్రబృందం చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అనూహ్యంగా విడుదల వాయిదా పడడంతో చిక్కుల్లో పడింది. ‘మార్క్ ఆంటోని’ సినిమా సెప్టెంబర్ 15న విడుదలవుతుందని విశాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *