Sat. Jul 20th, 2024
Who was Annie Besant? Her contribution to the National Movement

లండన్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో 1847 అక్టోబర్ 1న అనిబిసెంట్ జన్మించారు.తల్లి  ఎమిలీ మోరిస్ , తండ్రి విలియం వుడ్.ఆమె ఐరిష్ మూలానికి చెందినది. ఆమెకు ఐదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అనిబిసెంట్ తల్లి అబ్బాయిల కోసం ఒక బోర్డింగ్ హౌస్ నడుపుతూ కుటుంబాన్ని పోషించింది.కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని పోషించలేని ఎమిలీ మోరిస్ తన కూతురు అనిబిసెంట్ ను తన స్నేహితురాలైన మారియట్ కు అప్పగించింది.మేరియట్ పెంపకం నిజంగానే అనిబిసెంట్ కు వరంగా మారింది అనిబిసెంట్ కు స్త్రీల పట్ల బాధ్యత సమాజం పట్ల గౌరవం స్త్రీ స్వాతంత్రం గురించి అవగాహన కల్పించింది,యూరప్ అంతా చూయించింది.1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. లండన్‌లో జన్మించిన అనీ బీసెంట్ నాస్తిక భావజాలంతో సోషలిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. చార్లెస్ బ్రాడ్‌లాగ్‌తో కలిసి నాస్తికతను ప్రచారం చేస్తున్న సమయంలో చర్చి, మతాధికారుల నుంచి విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఆమె పై రాళ్లు రువ్వారు. ఆమె అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి.ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలగడంతో విడిపోయారు.భర్తతో విడాకులు తీసుకున్నతర్వాత సోషలిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ర్యాలీలు నిర్వహించారు. ‘మై పాథ్ టు ఎథీయిజమ్’ అనే పుస్తకాన్ని రాశారు. అనిబిసెంట్ బౌద్ధ, హిందూ, ప్రాచీన ఈజిప్ట్ ఆధ్యాత్మిక గ్రంథాలనూ చదివారు.

 

Who was Annie Besant? Her contribution to the National Movement
Who was Annie Besant? Her contribution to the National Movement

1880లో అనీ బిసెంట్ “హెలెనా బ్లావట్‍స్కీ”ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్యజ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా వక్త గా మారి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చింది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె 1893లో భారతదేశం వచ్చింది.కొన్ని రోజుల పాటు పర్యటించి వెనక్కి వెళ్లాలనే ఆలోచనతో భారత్‌లో అడుగు పెట్టిన అనీ బిసెంట్ 40 ఏళ్ల పాటు భారత్‌లోనే ఉండిపోయారు.ఆమె ఎడ్ల బండ్లపై, రైళ్లలో దక్షిణ భారతదేశంలో పర్యటించారు. మదురై, తిరునల్వేలి, హైదరాబాద్‌లో ప్రసంగాలు చేశారు. ఆమెను దక్షిణ భారతదేశంలో పెరియమ్మ అని ఉత్తరాదిలో బడీ మేమ్ సాహిబ్ అని పిలిచేవారు.లండన్ లో ఉన్నప్పుడే ఆమె భారతీయ తత్వం హిందూ మత విశ్వాసాలు సంస్కృతిక సాంప్రదాయాలు విశిష్టత గురించి తెలుసుకున్నారు ఈ విషయాలు  భారత దేశంలోఆమె కార్యకలాపాలు నిర్వహించడానికి దోహదపడ్డాయి.హిందూ మతం, ఆకర్షణ శక్తి, శాఖాహారం గురించి ప్రసంగాలిచ్చారు. దీంతో ఆమెకు లండన్ యూనివర్సిటీ డిగ్రీ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ నిర్ణయం ఆమె భారత్‌లో యూనివర్సిటీ స్థాపించాలనే ఆలోచనకు బీజం వేసింది.భారతదేశంలో ప్రో యూనియన్ స్థాపించి కార్మికుల హక్కులకై పోరాటం జరిపారు. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె ” కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ “ను ఇంగ్లాండులో స్థాపించింది.డాక్టర్ భగవాన్ దాస్ సహాయంతో భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించారు పురాణ ఇతిహాసాలు వేదాలు భగవద్గీత గురించి చాలా ప్రదేశాలలో ఉపన్యాసాలు ఇచ్చారు. భారత దేశంలోని వివిధ ప్రదేశాల ప్రజలు వీటి పట్ల ఆకర్షితులయ్యారు సమాంతరంగా మత సహనాన్ని గురించి వివరించడం ఈమె గొప్పతనాన్ని పెంపొందించింది.

1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.మద్రాస్ లోని అడయార్ కేంద్రంగా ఈమె దివిజ్ఞాన సమాజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సమయంలోనే ఆమె భారత దేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం గురించి తెలుసుకున్నది.భారత స్వాతంత్ర పోరాటంలో మమేకం అయ్యాక భారత స్వతంత్ర పోరాటం గురించి బ్రిటిష్ వారి దృష్టికి తీసుకొని వచ్చింది భారత ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు మీరు ఇచ్చే అలంకారమైన పదవులు మాత్రం వారు కోరుకోవడం లేదని ఆమె బ్రిటిష్ వారికి విన్నవించింది కానీ వారు ఆమె చెప్పిన విషయాన్ని వినిపించుకోలేదు.దాంతో అనిబిసెంట్ బ్రిటిష్ వారిపై పోరాడుతున్న భారత ప్రజలతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది.భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనను అదుపు చేయాలంటే హిందూ ముస్లింల మధ్య ఐక్యత అవసరమని ఆమె భావించి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆరంభించారు.అలాంటి ఐక్య వాతావరణం మొదటిసారిగా 1916లో కనిపించింది ఈ సంవత్సరం లక్నోలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి కారణం హిందూ ముస్లింల ఐక్యత ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నామరియు కాంగ్రెస్ నాయకులు ఒక ఒప్పందాన్ని రూపొందించారు ఆ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ మరియు ముస్లిం  నాయకులం ఐక్యత కోసం మూడు సంవత్సరాలుగా విశేషంగా కృషి చేశారు. అనీ బీసెంట్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేశారు. 1917లో ఆమెను విడుదల చేశారు. 1917 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు అనివిసెంట్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.

ఆమె భారత దేశంలో మూడు ప్రధాన పాత్రలు నిర్వహించారు ఒకటి జాతీయ కాంగ్రెస్తో కలిసి పని చేయడం రెండు దివిజ్ఞాన సమాజంలో భాగంగా ఆధ్యాత్మికత గురించి ప్రచారం నిర్వహించడం మూడవది విద్యావ్యాప్తి.ఒక దశలో అన్నిబిసెంట్ తిలక్ తో కలిసి ఉద్యమాన్ని నడిపించారు అనీ బీసెంట్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేశారు. 1917లో ఆమెను విడుదల చేశారు.ఈ క్రమంలో హోం రూల్ ఉద్యమంలోకి వచ్చిన వారే మోతిలాల్ చిత్తరంజన్ దాస్ జిన్నాతదితరులు,తర్వాత గాంధీజీ ఈ సంస్థను కాంగ్రెస్తో కలిసి పనిచేసే విధంగా ఒప్పించారు దివ్యజ్ఞాన సమాజం భారతీయ సమాజం మీద వేసిన ముద్ర అసాధారణమైనది దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం అని బిసెంట్ దివిజ్ఞాన సమాజం అధ్యక్ష హోదాలో కొనసాగారు పలుచోట్ల ఆ సంస్థ పాఠశాలలు నిర్వహించేది మద్రాస్ లో సెంట్రల్ హిందూ స్కూల్, నేషనల్ హై స్కూల్, వసంత మహిళా కళాశాల ఆమె స్థాపించినవే అలాగే వైద్యశాలను కూడా ఏర్పాటు చేసింది. దివ్యజ్ఞాన సమాజం తరఫున ఒక విశ్వగురును ప్రతిష్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించారు అప్పటికే ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు.అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శి ఎడ్విన్ మాంటేగ్, వైస్‌రాయ్ లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ ఆమెను… రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని అడగగా, “నాకు మొదట్నుంచీ రాజకీయ ఆలోచనలున్నాయి. కానీ, దేశం గురించి మొదట తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే విద్యా రంగం వైపు దృష్టి పెట్టాను” అని సమాధానం చెప్పారు.

1918లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఫ్రాంచైజ్ (సార్వత్రిక ఓటు హక్కు) కమిటీ దేశమంతా పర్యటించింది. భారతీయ మహిళలకు ఓటు ఇవ్వరాదని ఈ కమిటీ తీర్మానించింది. అయితే, మహిళలను వోటింగ్ హక్కుల నుంచి పక్కన పెట్టడం భారతీయుల ఆశలకు, ఆశయాలకు తీవ్ర భంగం కలిగించినట్లవుతుందని ఆమె ఇంగ్లాండ్ వెళ్లి పార్లమెంటరీ కమిటీకి చెప్పారు.ఇంగ్లిష్ మహిళల కంటే భారతీయ మహిళలకు ఓటు హక్కు ఎక్కువ అవసరమని ఆమె తన ప్రసంగాల్లో చెప్పారు. ఆధునిక భావాలతో మాట్లాడుతున్నారని పత్రికలు ఆమెను విమర్శించాయి.ఆమె 1909లో జిడ్డు కృష్ణమూర్తిని కలిశారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలు ఆమె జీవితం జేకేతో ముడిపడి ఉంది. ఆమె జేకేని దత్త పుత్రునిగా స్వీకరించారు. జేకేలో బుద్ధుడు, క్రీస్తు, జొరాస్టర్ కనిపిస్తున్నారని అనేవారు.అయితే, ఆమె మోసం చేసి తన కొడుకులను పెంచుకుందంటూ జిడ్డు కృష్ణమూర్తి తండ్రి కోర్టులో కేసు వేశారు. జేకే సోదరులను ఆక్స్‌ఫర్డ్ లో చేర్చాలని ఆమె తీవ్రంగా ప్రయతించారు.దివ్యజ్ఞాన సమాజం తరఫున ఒక విశ్వగురువుగా జిడ్డు కృష్ణమూర్తిని ప్రతిష్టించేందుకు ఆమె ప్రయత్నించారు అయితే,జిడ్డు కృష్ణమూర్తి తాను ఎవరికీ గురువును కాదంటూ, ఆత్మజ్ఞానం కోసం ఎవరి దారి వారే వెతుక్కోవాలంటూ 1929లో బహిరంగ సభలో ప్రకటించి ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు.బీసెంట్ స్వదేశీ సంస్థ ప్రచారం కోసం జేకేను ఉపయోగించుకోవాలని చూశారని చరిత్రకారులు అంటారు. జేకే చర్యతో ఆమె ఆధ్యాత్మిక వారసుడిని కోల్పోయారు.

కామన్ విల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా వంటి పత్రికలను స్థాపించారు. వేకప్ ఇండియా ,ఇండియా -ఇంగ్లాండ్ -ఆఫ్గనిస్తాన్ వంటి గ్రంథాలను రచించారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా,హోమ్ రూల్ సంస్థలను స్థాపించారు భారతదేశంలోని మహిళల కోసం మహిళా మండలాలను స్థాపించారు అశ్పురుషత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు స్త్రీ విద్య కోసం మహిళల ఓటు హక్కు కోసం విశేషంగా కృషి చేశారు.గాంధీ  ఆమెకు సమున్నత గౌరవం ఇచ్చేవారు.గ్రామ కౌన్సిల్, కాంగ్రెస్ ప్రతినిధులు, ఖాదీ నేత గురించి వారిద్దరి మధ్య వాదనలు జరిగేవి. గాంధీ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఆమె వ్యతిరేకించేవారు.”ఆమె వయసు, పరిణతి వల్ల నా అభిప్రాయాలను ఒక తల్లి ఎదుట కొడుకులా విన్నవించాను” అని గాంధీజీ అనేవారు.హోమ్ రూల్‌ను ఆమె ప్రతిపాదించినంతగా మరెవ్వరూ ప్రతిపాదించలేదని గాంధీ ఆమెను కొనియాడారు.భారతదేశంలో ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా భావించే కాశీ విశ్వవిద్యాలయం స్థాపనలో మదన్మోహన మాలవ్యకు అనిబిసెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించారు తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.1933లో అనీ బిసెంట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సెప్టెంబరు 20, 1933లో మద్రాస్ నగరంలోని అడయార్ లోని దివ్యజ్ఞాన సమాజం ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు.అక్కడే ఆమె పార్తివదేహాన్ని పూడ్చి పెట్టారు.ఉచిత షిప్పింగ్‌తో మీకు ఇష్టమైన toothbrushను అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము మరియు మీరు స్టోర్‌లో మీ ఆర్డర్‌ని కూడా తీసుకోవచ్చు అదే రోజు.

“భారతదేశం ఉన్నంత కాలం అనీ బీసెంట్ దేశానికి చేసిన సేవలు ప్రజల జ్ఞాపకాల్లో ఉంటాయి.అనీ బీసెంట్ ఎప్పటికీ సజీవంగా ఉంటారు. భారతదేశాన్ని ఆమె దత్తత తీసుకుని తనను తాను జాతికి అంకితం చేసుకున్నారు” అంటూ గాంధీజీ ఆమెకు నివాళి అర్పించారు”.

అడయార్  నది ఒడ్డున ఉండే దివ్యజ్ఞాన సమాజ ఆశ్రమంలో మర్రిచెట్టు ఒక అద్భుతం మర్రిచెట్టు విస్తీర్ణంలో దీనికి ప్రపంచ ఖ్యాతి ఉంది ఈ చెట్టు కిందే అనీ బీసెంట్ ఎందరినో సమావేశపరిచింది ఆ చెట్టు నీడన ఆమె ఏర్పాటు చేసిన తేనీటి విందులకు రాజకీయవేతలు కవులు కళాకారులు  స్త్రీ జనోద్ధారకులు సంస్కర్తలు హాజరయ్యేవారు.

ఒక ఐరిస్ దేశానికి చెందిన మహిళ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ స్వాతంత్రం కోసం మహిళల కోసం కృషి చేసినందుకు ఆమెను స్మరించుకోవడం మన బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *