20 వ శతాబ్దంలో అత్యంత ప్రతిభావంతమైన, ప్రతిభాశీలిని కలిగిన వ్యక్తుల్లో ఐన్ స్టీన్ ఒకరు. అయన గణితంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీ దేశంలో కింగ్డమ్ అఫ్ వార్టమ్ బెర్గ్ ( Kingdom of Württemberg ) అనే రాష్ట్రం లోని ఉల్మ్ (ULM) నగరం లో 14 మార్చ్ 1879 జన్మించారు. ఐన్‌స్టీన్ తండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్ ఒక సేల్స్ మ్యాన్ మరియు ఇంజనీర్ గా పనిచేసేవాడు, ఐన్‌స్టీన్ తల్లి పాలిన్ కోచ్ ఒక హౌస్ వైఫ్.ఐన్‌స్టీన్ కి చిన్నప్పటి నుండి మాథ్స్ మరియు సైన్స్ అంటే చాలా ఇష్టం.
12 సంవత్సరాలప్పుడు తన ట్యూషన్ మాస్టర్ ఇచ్చిన మాథ్స్ పుస్తకం ను కొద్దీ రోజుల లోనే నేర్చుకొని అడ్వాన్స్ మాథ్స్ ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొద్దీ రోజుల లోనే ఐన్‌స్టీన్ చదివే మాథ్స్ తన ట్యూషన్ మాస్టర్ కే అర్థం అయ్యేది కాదు.గ్రాడ్యుయేషన్ తర్వాత 1901 లో స్విట్జర్లాండ్ లోని బెర్న్ ఒక పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినెర్ గా పనిచేసారు.
1900 వ సంవత్సరంలో ఐన్‌స్టీన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఐన్‌స్టీన్‌కు 1901 వ సంవత్సరంలో స్విట్జర్లాండ్ పౌరసత్వం లభించిన తర్వాత తనకున్న పరిచయాలతో ఆ దేశంలో Federal Office for Intellectual Property అనే పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినేర్ గా పనిచేయడటం మొదలుపెట్టారు.

ఏదైనా కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు పేటెంట్ ఆఫీస్ కి వెళ్లి తమ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటారు. ఈ పేటెంట్ ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఐన్‌స్టీన్ చాలా వరకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారం, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ యొక్క టైం synchronization గురించి సంబంచిన పేటెంట్లు వచ్చేవి. ఇలా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఐన్‌స్టీన్ కాంతి యొక్క స్వభావం,స్పేస్ మరియు కాంతి (space and time) కి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
ఐన్‌స్టీన్ E = MC^2 అనే ఫార్ములా ను కనుగొనడం జరిగింది. ఈ ఫార్ములాలో E అనగా ఎనర్జీ, M అనగా మాస్, మరియు C అనగా కాంతి వేగం. అంతరిక్షంలో ఒక వస్తువు కాంతివేగంతో ప్రయాణించినపుడు ఆ వస్తువు యొక్క సమయం లేదా వయస్సు నెమ్మదిగా కదులుతుంది.
ఈ థియరీ ప్రకారం అంతరిక్షంలో ఉన్న ప్రతి వస్తువు తమ తమబరువు వల్ల స్పేస్ మరియు టైం లో మార్పులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు గ్రావిటీ (గురుత్వాకర్షణ బలం) తక్కువగా ఉన్నప్పుడు A నుంచి B కి ప్రయాణించడానికి తక్కువ సమయం పడుతుంది.
ఒకవేళ గ్రావిటీ ఎక్కువగా ఉంటే స్పేస్ మరియు టైం లో చాలా మార్పులకు దారితీస్తుంది ఫలితంగా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. బ్లాక్ హోల్స్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండటం వళ్ళ సమయం కూడా నెమ్మదిగా కదులుతుంది. ఈ థియరీ చాలా వరకు శాస్త్రవేత్తలకు సహాయపడింది మరియు సమయానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానం లభించింది.క్వాంటమ్ థియరీ అభివృద్ధికి ఐన్‌స్టీన్ చాలా కృషి చేసారు. క్వాంటమ్ థియరీ ముఖ్యంగా మోడరన్ ఫిజిక్స్ గురించి వివరిస్తుంది. మ్యాటర్ మరియు ఎనర్జీ యొక్క ప్రవర్తన అణువు మరియు ఉప అణువు స్థాయిలో జరిగే మార్పుల గురించి ఈ క్వాంటమ్ థియరీ లో చదవటం జరుగుతుంది.
1921 లో ఐన్‌స్టీన్ చేసిన కృషికి గాను ఫిజిక్స్ లో ముఖ్యంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం తానూ చేసిన కృషికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వటం జరిగింది.
అయన మరణించే వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే, ఆయనకు ఆరోగ్యం బాగాలేక హాస్పటిల్ లో జాయిన్ అయ్యాక, కూడా తాను బతకాలని అనుకున్నాడు. ఐన్‌స్టీన్‌కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే, తనకు బలవంతంగా, కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే
చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానం ఇచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు.
అయితే హాస్పిటల్ లో చికిత్స పోయిండుతున్న ఐన్ స్టీన్ ఓ కోరిక కోరారు. తన శరీరం పరిశోధనకు కాకుండా పూర్తిగా ఖననం చేయాలని అన్నారు. అయితే, ఐన్ స్టీన్ కోరిక నెరవేరలేదు.ఐన్‌స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే.. ఆయన మెదడును దొంగిలించాడు. ఐన్‌స్టీన్ కుటుంబికుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు.
అతను ఆ మెదడును దొంగిలించినపుడు దాని బరువు 1250 గ్రాముల బరువు ఉన్నట్టుగా హార్వే చెప్పారు. తరువాత ఆ మెదడును 240 భాగాలుగా కట్ చేసి ప్రత్యేక రసాయనాల్లో ఉంచారు. అయితే ఐన్ స్టీన్ మెదడు దొంగతనం జరిగినట్టుగా ఎవరికీ తెలియలేదు చాలా కాలం పాటు. విషయం తెలిసిన తరువాత హార్వేను ఉద్యోగం నుంచి తొలగించారు. ఐన్ స్టీన్ అంతటి తెలివైన వ్యక్తిగా ఎలా ఉన్నాడో తెలుగుకోవడానికి ఆ మెదడు భాగాలను 40 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలోని మట్టర్ మ్యూజియంలో ఉన్నాయి.
ఐన్‌స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్లు రహస్యంగానే సాగాయి. అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆతృతగా ఎదురుచూశారు. చివరికి 1985లో ఐన్‌స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు. ఐన్‌స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. ఆయన మెదడులోని లోయర్ పరైటాల్ లోబ్ 20 శాతం పెద్దదిగా ఉండటం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ మెదడులో కంటే 17 శాతం అధిక న్యూరాన్లు ఐన్‌స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు.