Sat. Jul 20th, 2024

హైదరాబాద్ నగరం అంటే ప్రపంచంలో తెలియని వారెవరు ఉండరు కానీ హైదరాబాద్ చరిత్ర తెలియని చాలామంది మేం డెవలప్ చేసాం అంటే కాదు కాదు అని మేము డెవలప్ చేసాం అని చెప్పుకుంటూ ఉన్నారు నిజానికి హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంత ప్రజల రక్తంతో చిందించిన చెమటతో నిజాం నిర్మించిన నగరం. ఏ ప్రాంత పాలకుడైన లేదా రాజైన ప్రజల సొమ్ముతో వారికి అవసరాలను కల్పిస్తారు నేడు హైదరాబాద్ నగరంలో ఉన్న నిమ్స్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నిజాంసాగర్ జలాశయం ఉస్మాన్ సాగర్ జలాశయం హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ అసెంబ్లీ హాలు టౌన్ హాలు చార్మినార్ గోల్కొండ కోట ఎవరు ఎలా నిర్మించారు అలాగే హైదరాబాద్ ప్రాంతం యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

హైదరాబాద్ అనగానే మనకు నిజాం నవాబు గుర్తుకు వస్తారు నిజాం అనగానే అణిచివేత రైతు ఉద్యమాలు ఒకవైపు మరొకవైపు జాగిర్దారులు జమీందారులు రజాకార్ల చేతిలో నరకయాతన అనుభవించిన ప్రజలు ఇలా నిజాం చరిత్రను చెప్పాలంటే రెండు రకాలుగా చెప్పాల్సి ఉంటుంది మన దేశం బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 565 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానమే హైదరాబాద్ సంస్థానం. టర్కీ నుండి బతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి మొఘలుల సంస్థానంలో కొలువు చేసిన అసఫ్ జాహీ వంశస్థులు మొఘలుల ప్రాబల్యం తగ్గగానే దక్కన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అసఫ్ జాహీ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ ఇతని అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్. మీర్ ఖమ్రుద్దీన్ తాత ఖాజా ఆబిద్ ఖాన్ భారతదేశానికి 1604లో వచ్చారు ఇతడు షాజహాన్ కొలువులో చేరిన తర్వాత దక్కన్ సుబేదారు ఔరంగజేబుకు అంగరక్షకుడిగా నియమింపబడ్డాడు ఔరంగాజేబు మొఘలుల రాజ్యానికి సుల్తాన్ అయ్యాక గోల్కొండ ముట్టడిలో కుతుబ్షాహీలతో జరిగిన యుద్ధంలో 1687లో ఆబిద్ ఖాన్ మరణించాడు ఆబిద్ ఖాన్ కుమారుడు మీర్ షాబుద్దీన్ కూడా మొఘలుల కొలువులో చేరాడు తర్వాత అతడు మాల్వా గుజరాత్ ప్రాంతాలకు సుబేదారుగా నియమింపబడ్డాడు ఇతడు 1710 లో మరణించాడు ఇతడి కుమారుడే మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని జయించి తన రాజ్యంలో దక్కన్ సుభాగా కలుపుకున్నాడు ఔరంగాబాద్ అంటే ఆనాడు శంభాజీ నగర్ అని పిలిచేవారు ఔరంగాబాద్ దక్కన్ ప్రాంతంలో సుబేదార్ పాలనలోకి వచ్చింది. 1713లో దక్కన్ ప్రాంత సుబేదారుగా నిజాం ముల్క్ నియమింపబడ్డాడు. 1707లో  ఔరంగజేబు మరణంతో మొఘలుల పతనం ఆరంభమయ్యింది. సైన్యాధిపతులు సుబేదారులు వివిధ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని స్వాతంత్రం ప్రకటించుకున్నారు కానీ దక్కన్ సుబేదారుగా ఉన్న నిజాం ఉల్ ముల్క్ చక్రవర్తికి విధేయుడుగా ఉండి 17 24 వరకు స్వాతంత్రాన్ని ప్రకటించలేకపోయాడు 1724లో స్వాతంత్రం ప్రకటించుకుని దక్కన్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు 1724 నుండి 1948 వరకు దాదాపు 224 సంవత్సరాల పాటు అసఫ్ జాహీ వంశస్థులు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవి తెలంగాణలో 8 జిల్లాలు మరాట్వాడా ప్రాంతంలో ఐదు కర్ణాటకలో మూడు జిల్లాలు ఉండేవి సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉన్న దక్కన్ పీఠభూమి మన హైదరాబాద్ సంస్థానం గోదావరి కృష్ణ అనే నదుల పరివాహక ప్రాంతాన్ని మంజీరా ప్రాణహిత మూసి తుంగభద్ర మానేరు భీమా డిండి వంటి ఉపనదులు కూడా ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతంలో మెట్ట పంటలు ఎక్కువగా పండేవి చెరువులు కుంటలు బావుల ద్వారా వరి పంటలు ఎక్కువగా సాగు చేసేవారు మరాట్వాడా ప్రాంతంలో పత్తి ఎక్కువగా సాగు చేసేవారు ఇలా రైతులు కష్టపడి పండించిన పంటలపై నిజాం పన్నులు ఎక్కువగా వసూలు చేసి రైతుల పంటలను వారి కష్టాన్ని దోచుకునేవాడు అలా రైతుల కష్టంతో ఒక్కో అవసరాన్ని ఒక్కో పాలకుడు నిర్మిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని అభివృద్ధి చేశారు.

హైదరాబాద్ సంస్థానంలో చిన్నవి 14 సంస్థానాలు ఉండేవి గురుకుంట సంస్థానం కర్ణాటకలో ఉండగా మిగతా 13 సంస్థానాలు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. ఈ చిన్న సంస్థానాలు అసఫ్ జాహీల కంటే ముందుగా తెలంగాణలో ఉండేవి వీటిని దొరల సంస్థానాలు అనేవారు వీటి స్వయం ప్రతిపత్తిని నిజాం రాజు ఒప్పుకొని తన రాజ్యంలో భాగం చేసుకున్నాడు. అమరచింత గద్వాల వనపర్తి జటప్రోలు దోమకొండ నారాయణపేట వంటి సంస్థానాల వార్షిక ఆదాయం ఒక లక్షకు మించి ఉండేది, గోపాలపేట ఆనగొంది రాజపేట దుబ్బాక పాపన్నపేట కొల్లాపూర్ శరణపల్లి వంటి సంస్థానాల ఆదాయం లక్ష్యకు అటు ఇటుగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం యొక్క జనాభా సుమారు కోటి 80 లక్షలు గా ఉండేది నిజాంకు సొంత జాగీరు భూమి ఉండేది దీనిని సర్ఫే కాస్ అని పిలిచేవారు అంటే నిజాం సొంత భూమి అని అర్థం దాదాపుగా 530000 ఎకరాల భూమి ఉండేది దీని నుండి ప్రతి సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈ విధంగా వచ్చిన ఆదాయం నిజాం ఖాతాలోనే జమ అయ్యేది. 2600 మంది జమీందారులు ఉండేవారు వీరి ఆధీనంలో సుమారు పదివేల గ్రామాలు ఉండేవి 7040000 ఎకరాల భూమి ఉండేది మొత్తం సంస్థానంలో 21,600 గ్రామాలు ఉండేవి 26,00 మంది భూస్వాములు ఉండేవారు వీరు సంస్థానంలోని ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేవారు అధిక పన్నులు వసూలు చేసేవారు ఎదురు తిరిగే ప్రజలనురజాకార్లతో భయం కలిగించే శిక్షలు గురించేవారు ఆ శిక్షలు దారుణంగా ఉండేవి అలా జరిగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1724 నుండి ఏడుగురు నిజాంలు దాదాపు 220 సంవత్సరాలు పరిపాలించారు మొదటివాడు నిజాం అలీ ఖాన్ చివరివాడుమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీరు ఏడుగురు తెలంగాణ ప్రాంత ప్రజలను పట్టి పీడించారు మిగతా ఆరుగురు ఒక ఎత్తు అయితే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరొక ఎత్తు ఇతడి పరిపాలనలో హైదరాబాద్ ప్రాంత ప్రజలు నరకం అనుభవించారు.

 

అభివృద్ధివైపుగా నిజాం వేసిన అడుగులు

విద్య

నిజాం ఈస్ట్ ఇండియా కంపెనీ తో మంచి సంబంధాలు కొనసాగించారు విద్య వైపుగా అడుగులు 1834లోనే పడ్డాయి

1834లో బ్రిటిష్ వారి సౌజన్యంతో నిజాం ఆబిడ్స్ లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ ను ప్రారంభించారు ఇది యూరోపియన్ల పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది.

1923లో ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేశాడు జమీందారీ వ్యవస్థ రద్దవడంతో 1951 లో దీనిని ప్రభుత్వ పాఠశాలగా మార్చారు ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సత్య నాదెండ్ల గారు, క్రికెట్ కామెంట్ టేటర్ అయినా హర్ష భోగ్లే గారు,అక్కినేని నాగార్జున గారు,మాజీ కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి అశోక గజపతిరాజు గారు,ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రైమ్ వస్తా ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ టోరేట్తో వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ మరియు CEO, TIC కొరియన్ విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వంటి ప్రముఖులు ఎందరో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.

1839 లో బొల్లారం ప్రెసిడెంట్లు వైద్య పాఠశాలను స్థాపించారు.

1855లో ఆల్ సెయింట్ స్కూల్స్ ను రోమన్ క్యాథలిక్ మిషన్ వారి సౌజన్యంతో స్థాపించారు.

1853-54లో హైదరాబాద్ ప్రాంతంలో సోలార్జింగ్ ఓరియంటల్ కాలేజీ ని దార్ ఉల్ ఉలూమ్ ప్రారంభించడం విద్యావ్యవస్థ ఏర్పాటులో కీలక అడుగుగా చెప్పవచ్చు.

1859లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి తాలుకలో రెండు ప్రతి జిల్లాలో మూడు పాఠశాలలు ప్రారంభించారు

1870లో సిటీ హై స్కూల్ ప్రారంభించారు.

1872లో చాదర్ఘాట్ హై స్కూల్ ఏర్పాటు చేశారు.

ప్రభువుల పిల్లలకు విద్యను అందించడానికి మదర్సా ఏ ఆలియా మరియు మదర్సా ఇ ఐజ అనే రెండు ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేశారు.

1882లో వెస్టియన్ మిషన్ చాదర్ ఘాట్ మరియు సికింద్రాబాద్లో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి నిజాం ప్రభుత్వం సహాయం చేసింది.

1872లో హైదరాబాద్ సంస్థానంలో 125 స్థానిక పాఠశాలలు నిర్వహించబడ్డాయి.

1887లో నిజాం కళాశాలను స్థాపించారు.

1894లో హైదరాబాద్లో వేద ధర్మ ప్రకాశిక అనే సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేయబడింది.

1882లో ముస్లిం యువత కోసం మదర్సా ఈ దీనియా పాఠశాల ప్రారంభించారు.

1899లో మరొక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు.

1895లో అసఫియా ఉన్నత పాఠశాల స్థాపింపబడింది.

1901లో వివేకవర్ధిని మరాటి పాఠశాలలను ఏర్పాటు చేశారు.

1904లో మొదటి తెలుగు పాఠశాలను కాలోజీ రంగారావు చాదర్ ఘాట్ లో ప్రారంభించారు.

1909 లో అన్వర్ ఉలూమ్ ఉన్నత పాఠశాలలను మౌలి మహమ్మద్ అబ్దుల్ రజాక్ స్థాపించారు.

1877 లో హైదరాబాద్ సంస్థానంలో స్త్రీ విద్యను ప్రోత్సహించేవారు కాదు స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం 1877లో డాక్టర్ అఘోర నాకు ఛటోపాధ్యాయ ముస్లింలు మరియు హిందువుల కోసం బాలికల పాఠశాలను స్థాపించారు.

1885లో ముస్లిం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు నాంపల్లిలో బాలికల పాఠశాలలను ప్రారంభించారు.

1895లో స్టాన్లీ బాలికల పాఠశాల ప్రారంభించారు పాఠశాలలను స్థాపించిన సరే హిందూ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండు వెళ్లాలంటే పర్షియన్ లేదా ఉర్దూ భాషలో ప్రావిణ్యం ఉండాలనే నిబంధన విధించి హిందూ యువకులు ఇంగ్లాండ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో హిందువుల హక్కుల కోసం 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజం స్థాపించారు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు 85% హిందువులు తెలుగు మాట్లాడేవారు ఉండగా విస్మరించి ఉర్దూను పరిపాలన వ్యవస్థలో భాగంగా ప్రోత్సహించారు.

1901 లో కొమ్మరాజు లక్ష్మణ్ రావు హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు.

1904లో హన్మకొండలో  శ్రీ రాజరాజ ఆంధ్రభాషా నిలయం స్థాపించారు,1905లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంపర్దిని గ్రంథాలయం అనే రెండు గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.

1918 మరియు 1933లో రాజ బహదూర్ వెంకట్రామారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి హాస్టల్స్ ను ఏర్పాటు చేశారు.

1928 లో నారాయణగూడ లో బాలికల ఉన్నత పాఠశాల స్థాపించారు.

భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల దళితుల కోసం పోరాడి హైదరాబాద్ నగరంలో దళిత పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడు.

1887లో నిజాం కాలేజీని ఏర్పాటు చేశారు.

1918 లో 1600 ఎకరాల్లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించారు.

1921లో హైదరాబాద్ సిటీ కాలేజీని ఏర్పాటు చేశారు.

1944లో ఏవీ కాలేజీని ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సంస్థానంలో 1949 నాటికి పాఠశాలల సంఖ్య 4వేలకు పెరిగింది ఇలా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో పాఠశాలలు కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి.

 

వైద్యం

1888లో 6వ నిజాం TB & CHEST HOSPITAL ఎర్రగడ్డ లో ఏర్పాటు చేశాడు ఇక్కడ కొన్ని లక్షలమంది టీవీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించబడుతూనే ఉంది.

1915 ఆగస్టు 20న నిజాం నవాబు ఫీవర్ హాస్పిటల్ ను ఏర్పాటు చేశాడు కలరా బాధితుల కోసం జ్వర బాధితుల కోసం దీనిని ఏర్పాటు చేశారు రోనాల్డ్ రాస్ ఇక్కడే పరిశోధనలు కొనసాగించాడు.

1949లో నీలోఫర్ యువరాణి నిలోఫర్ హాస్పిటల్ ను చిన్నపిల్లల వైద్యం గురించి ప్రారంభించారు.

1926లో హైదరాబాద్ చివరి నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం హాస్పిటల్ ను నిర్మించారు.

1909లో ఉస్మానియా హాస్పిటల్  భవన నిర్మాణం పూర్తయింది.

1952లో ESI మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు.

రవాణా వ్యవస్థ

Nizam’s Guaranteed State Railway

NIZAMS GUARANTED STATE RAILWAY (NGRS) 1879 నుండి 1951 భారతదేశంలో పనిచేసిన రైల్వే సంస్థ. ఇది హైదరాబాద్ స్టేట్ నిజాం నవాబుల యాజమాన్యంలో నడిచేది. భారతదేశంలో అతిపెద్ద సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం ఒకటి కాబట్టి హైదరాబాద్ 6వ నిజాం తన రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాతో అనుసంధానించడానికి రైలు మార్గాన్ని నిర్మించాడు హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వాడి వరకు 1870లో ప్రారంభించబడి 1874లో పూర్తయింది.1879లో రైల్వే టికెట్ల కోసం సికింద్రాబాదులో రైల్వే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుచేయబడింది.

NIZAM ROAD TRANSPORT

1932లో NIZAM ROAD TRANSPORT రైల్వే వ్యవస్థకు అనుసంధానిస్తూ ఏర్పాటు చేయబడింది 27 బస్సులతో 450 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని అనుసంధానించారు దశాబ్ద కాలంలోనే 500 బస్సులతో 7200 కిలోమీటర్ల సుదుల ప్రాంతాన్ని అనుసంధానించారు 1951 లో హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ గా మారి 1958లో APSRTC లో విలీనం చేశారు.

DECCAN AIRWAYS

నిజాం టాటా వారి సౌజన్యంతో 71% నిధులు కేటాయించి 1945లో డెక్కన్ ఎయిర్వేస్ ప్రారంభించారు దీనిలో టాటా వారి వాటా 29% హైదరాబాద్ నుండి ప్రతి వారం మద్రాస్ ఢిల్లీ నాగపూర్ భోపాల్ గ్వాలియర్ బెంగళూరు ఫ్లైట్స్ నడిచేవి. 1946-47 నుండి ప్రతి రోజు మద్రాస్ ఢిల్లీ బాంబే ఫ్లైట్స్ వెళ్ళేవి అప్పట్లోనే 11000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 1952 ఆపరేషన్ పోలో తర్వాత భారత ప్రభుత్వం 1953లో ఇండియన్ ఎయిర్లైన్స్ గా ఏర్పాటు చేసింది.

నాటి నిజాం FILM AWARDS నేటి FILMFARE AWARDS

నిజాం ఫిల్మ్ ఇనిస్ట్యూట్ నిజాం ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే అప్పట్లో బాలీవుడ్ ని మించి ఉండేది నిజాం హిందీ సినిమా పరిశ్రమని బాగా ఎంకరేజ్ చేసి అవార్డు సైతం అందించారు.1927 లో రాయల్ టాకీస్ 1930లో యుక్త మహల్ మోతి మహల్ టాకీస్ లను నిర్మించారు 1934లో మనోహర్ టాకీస్ నిర్మించారు వీటితో పాటుగా 1939లో ప్యాలెస్ థియేటర్ మినర్వా అమర్ డ్రీమ్ ల్యాండ్ రామేశ్వర్ టాకీస్ పారడైజ్ రతన్ మహల్ లాంటి ఎన్నో టాకీసులు ఉండేవి.

నిజాం ఫిలిం అవార్డ్స్ ని 1942లో ప్రారంభించారు.1942 ఫిబ్రవరి 15  మొట్టమొదటిసారిగా NIZAM FILM AWRDS చౌహమల్లా ప్యాలెస్ లో అందజేశారు.

1947లో దేశానికి స్వాతంత్రం రాగానే నిజాం ఫిలిం అవార్డ్స్ ఆపివేశారు,వీటి స్థానంలో 1955 నుండి FILM FARE AWRDS ప్రారంభించారు.

  • Best Film: Shalimar (Telugu)
  • Best Actor: Prithviraj Kapoor (for his role in Jwar Bhata)
  • Best Actress: Devika Rani (for her role in Kismet)
  • Best Director: Mehboob Khan (for Jwar Bhata)
  • Best Music Director: Salil Chowdhury (for Shalimar)
  • Best Lyricist: Shakeel Badayuni (for the song “Aaj Kal Tere Mere Pyar Ke Charche” from Jwar Bhata)

 

NIZAM ELECTRICITY BOARD

నిజాం ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920వ సంవత్సరంలో హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ను నిర్మించారుఇది దేశంలోనే మొట్టమొదటి థర్మల్ ప్రాజెక్టు.థర్మల్ పవర్ స్టేషన్ మింట్ కాంపౌండ్ లో నిర్మించబడింది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా విద్యుత్ అందించబడింది, రోజు 200 టన్నుల బొగ్గు వినియోగంతో 22.5 మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది 1972లో రెండు యూనిట్స్ మూతపడే వరకు ఈ ప్లాంట్ పనిచేసింది 1984లో కొన్ని కారణాల వలన అప్పటి ప్రభుత్వం దీనిని మూసివేయగా 1995లో దీనిని కూల్చివేశారు.

నీటిపారుదల ప్రాజెక్టులు

1908లో మూసినదికి వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు ఆందోళనకు లోనై ప్రఖ్యాత ఇంజనీర్ అయినా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ను పిలిపించి వరదలు మరియు తుఫానుల నుండి హైదరాబాద్ నగర రక్షణకై పటిష్టమైన ప్రణాళికతో డ్రైనేజీ సిస్టంను రూపొందించాలని కోరాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ సిస్టంను రూపొందించాడు నేటికి ఆ డ్రైనేజీ సిస్టం పనిచేస్తూనే ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మూసినదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి సలహా ఇచ్చాడు మురుగునీటి కాలువల నిర్మాణం కూడా సూచించాడు. ఆయన సూచనతోనే హైదరాబాద్ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయబడింది ఉస్మాన్ అలీ ఖాన్ 1920లో 60 లక్షలతో ఉస్మాన్ సాగర్ నిర్మించాడు 1923లో నిజాంసాగర్ జలాశయాన్ని నిర్మించాడు హైదరాబాద్ నగర మరియు తెలంగాణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికై వీటిని నిర్మించారు.

హైదరాబాద్ సంస్థానంలోని పరిశ్రమలు

1920లో కార్ఖానా జిందా థిలిస్మాత్ ప్రారంభించబడింది.

1921లో సింగరేణి కాలరీస్ స్థాపించబడింది.

1922లో హైదరాబాద్ డెక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు.

1930లో వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు.

1934లో వరంగల్లో ఆజం జాహీ మిల్ ఏర్పాటు చేశారు.

1937లో బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు.

1942లో ఆల్విన్ మెటల్ వర్క్స్ ఏర్పాటు చేశారు.

1943లో ప్రాగా టూల్స్ ఏర్పాటు చేశారు.

1946లో హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఏర్పాటు చేశారు.

1946లో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేశారు.

1942లో సిర్పూర్ పేపర్ మిల్స్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సంస్థానంలోని ప్రముఖ నిర్మాణాలు

1856లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.

1869 లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు.

1870లో ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మించారు.

1874లో ఫస్ట్ రైల్వే లైన్ నిర్మించారు.

1876లో హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు.

1878లో సికింద్రాబాద్ క్లబ్ ఏర్పాటు చేశారు.

1884లో నిజాం క్లబ్ ఏర్పాటు చేశారు.

1885లో టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ స్థాపించారు.

1886లో మలక్పేట్ లో రేస్ క్లబ్ ఏర్పాటు చేశారు.

1894లో ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించారు.

1895లో నిజాం నాణేల ముద్రణ కోసం మింట్ కాంపౌండ్ ఏర్పాటు చేశారు.

1896లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నిర్మించారు.

1898లో ప్రాగ ప్యాలెస్ నిర్మించారు.

1910లో హైదరాబాద్ లేడీస్ అసోసియేషన్ క్లబ్ ఏర్పాటు చేశారు.

1910లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కరెంటు ఉత్పత్తి చేశారు.

1914లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు.

1918లో పేపర్ కరెన్సీని మొట్ట మొదటిసారిగా ప్రారంభించారు.

1919లో హైదరాబాద్ హైకోర్టును ఏర్పాటు చేశారు.

1919లో ఉస్మానియా హాస్పిటల్.

1920లో ఉస్మానియా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు.

1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ డ్యాం ను నిర్మించారు.

1921లో న్యాయ వ్యవస్థను శాసన వ్యవస్థ నుండి వేరు చేశారు.

1922లో టౌన్ హాల్ నిర్మించారు నేటి అసెంబ్లీ హాల్.

1922లో ఉస్మాన్ షాహి మిల్స్ ఏర్పాటు చేశారు.

1927లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించారు.

1927లో డెక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ నిర్మించారు.

1929లో DBR MILLS LTD ఏర్పాటు చేశారు.

1932లో నిజాం స్టేట్ రైల్వే బోర్డ్ ఏర్పాటు చేయబడింది.

1933 ద కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు.

1934 స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు.

1935 ముజామ్ జాహి మార్కెట్ ఏర్పాటు చేశారు

1936 లో బేగంపేట్ ఏర్పోర్ట్ నిర్మించారు నిర్మించారు.

1938లో యునాని హాస్పిటల్ నిర్మించారు .

1940 సనత్ నగర్ లో తాజ్ గ్లాస్ వర్క్ ఏర్పాటు చేశారు.

1945లో డెక్కన్ ఎయిర్ వైస్ ఏర్పాటు చేశారు.

1937 ఫిబ్రవరి 22న విడుదలైన TIME MAGZINE సంచికలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని కవర్ పేజీ కథనాన్ని ప్రచురించారు.1948 సెప్టెంబర్ 18న ఆపరేషన్ పోలో జరిగి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయింది భారతదేశంలో విలీనం అయ్యేనాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా హైదరాబాద్ ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో ఆఫీసులకు భవనములు లేక కర్నూల్ రాజధానిగా టెంట్లు వేసుకుని ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్ర వారి చూపు హైదరాబాద్ రాష్ట్రం పై పడింది హైదరాబాద్ నగరం సిరిసంపదలతో వివిధ కార్యాలయాలతో భవనములుతో ప్యాలస్లతో మహల్ తో రాజధానికి ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని ఉన్నాయి అంతే వారి రాజకీయ చతురత వాడి హైదరాబాద్ ను ఆంధ్ర రాష్ట్రంలో కలిసే విధంగా రాజకీయం నడిపించారు 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం తో హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయి ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైంది ఆంధ్ర రాష్ట్ర సాధనకై పోరాడిన పొట్టి శ్రీరాములు గురించి చరిత్రలో పేర్కొన్నప్పటికీ తెలంగాణ సాయుధ రైతుల పోరాటం దొడ్డి కొమరయ్య  ఐలమ్మ వంటి వీరుల గురించి చరిత్రలో స్థానం కల్పించలేకపోయారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నెహ్రూ ఒక అమాయకపు అమ్మాయికి కొంటె కుర్రాడికి జరిగిన వివాహంగానెహ్రూ పేర్కొన్నారు.ఎక్కువ కాలం కలిసి ఉండటం కష్టమేనన్నారు.

1956 FEB 20 పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే అప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు కానీ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతం వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు ఉపముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు లాంటిదని అది అవసరం లేదని ఆ పదవి ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు ఒకరు టంగుటూరి ప్రకాశం పంతులు మరొకరు బెజవాడ గోపాలరెడ్డి ఇద్దరి వద్ద నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా పదవిని నిర్వర్తించాడు కానీ తాను ముఖ్యమంత్రిగా పదవిలోకి రాగానే ఉపముఖ్యమంత్రి పదవి అనవసరం అనడంతో ఇది కావాలని చేసిన కుట్రగా భావించిన తెలంగాణ ప్రాంతా నాయకుల ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నవి అలాగే తన మంత్రివర్గంలో కీలక శాఖలను ఆంధ్ర వారికి అప్పగించడంతో తెలంగాణ ప్రాంత ప్రజలు తాము మోసపోయినట్లుగా భావించారు పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉద్యోగ రక్షణను కూడా ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన డి.ఎస్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా నియమించాడు కొద్ది రోజులకు నీలం సంజీవరెడ్డి మీద అసమ్మతి సెగ తగులుకున్నది మర్రి చెన్నారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ, హయగ్రీవా చారి, గోపాలరావు, మేల్కోటి, పుల్లారెడ్డి తదితర వ్యక్తులు తెలంగాణ  తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం ప్రారంభించారు ఇక నాటినుండే తెలంగాణ ఏర్పాటుకు ఆవిర్భావం సంభవి ఇక నాటి నుండి తెలంగాణ రాష్ట్రంపై ఇక నాటి నుండి తెలంగాణ స్వరాష్ట్రంకై పోరాటం ఆరంభమైంది అలా 2014 JUNE 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

హైదరాబాద్ రాష్ట్రంలో భౌగోళిక మైన రక్షణతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది కానీ కొంతమంది మేం అభివృద్ధి చేశాం అంటే మేం అభివృద్ధి చేశాం అంటున్నారు నిజానికి మీరే చెప్పండి అన్ని సౌకర్యాలు గల హైదరాబాద్ రాష్ట్రం ఎవరు అభివృద్ధి చేశారు కామెంట్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *