మన భారతదేశం వేద భూమి ఇక్కడ ఎందరో పురాణా పురుషులు సాధువులు యోగులు రుషులు మహర్షులు జన్మించారు. కానీ ఇక్కడ మనం వేరే ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి అడుగుపెట్టిన సాధువు గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన 1861 లో జరిగింది ఒక సాధారణ వ్యక్తి మధ్యాహ్నం అలా పర్వత ప్రాంతాలలో విహరిస్తూ ఉన్నాడు అక్కడున్న ఒక ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ప్రదేశం మిగతా ప్రదేశాల కంటే భిన్నంగా కనిపించింది బాగా పరికించి చూడగా అక్కడ ఒక బంగారు మహలే కనిపించింది. అంతే ఆ సాధువు తన ఉత్సాహాన్ని ఆపుకోలేక అక్కడ అడుగుపెట్టాడు అలా సాధారణ మానవుడిగా అడుగుపెట్టిన అతడు ఆశ్చర్యకరంగా పవిత్రమైన సాధువుల తిరిగి వచ్చాడు.తిరిగి వచ్చిన ఆ సాధువు తనకు జరిగిన అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచగా అంతా నివ్వెర పోయారు. మరో ప్రపంచానికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ ప్రదేశానికి ఎలా వెళ్లగలిగాడు? అక్కడ ఏం చూసాడు? అక్కడ ఎవరిని కలిశాడు? ఆ మహల్లో ఏం జరిగింది? సాధువుల ఎలా తిరిగి వచ్చాడు ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1861లో ఉత్తరాఖండ్ లోని రాణిఖేడ్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు బదిలీపై వచ్చాడు ఆ సమయంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. ఆ యువకుడికి కొత్త కొత్త ప్రాంతాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం అలా విరామం దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలలో పర్వత ప్రాంతాలలో షికారు చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతాల్లోనే చాలామంది ఋషులు సాధువులు అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారని వారి వయస్సు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని అది ఒక మహిమాన్విత ప్రదేశం అని అతడు చాలా మంది ద్వారా విని ఉన్నాడు. అలా ఆ యువకుడు తన ఆఫీసు పని ముగిశాక ఆ పర్వత ప్రాంతాలలోకి వెళ్లి విహరించేవాడు. ఆరోజు కూడా తన ఆఫీసు పని ముగిశాక మధ్యాహ్న సమయంలో పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళాడు.

ఈ సంఘటన రానికేడ్ ప్రాంతంలోని ద్రోణగిరి పర్వత శ్రేణులు ఉన్న కోకో జిల్లా అనే ప్రదేశం యొక్క గుహ సమీపంలో జరిగింది కొండపై అలా వివరిస్తుండగా అతడికి కొన్ని శబ్దాలు వినిపించాయి అక్కడ ఎవరో తన చెవిలో తన పేరును గట్టిగా పిలుస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే అతడు అలా ముందుకు కదులుతూ ద్రోణగిరి పర్వతం ఎక్కడ ఆరంభించాడు కానీ ఒకవైపు అతడి మనసులో చీకటి పడితే ఎలా వెనక్కు రాగలను అనే ఆందోళన కూడా ఉంది చివరకు అతను కొండపై ఒక చదునైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ చుట్టూ చిన్నచిన్న గుహలు ఉన్నాయి అదే కొండపై ఒక గుహ ముందర ఒక అజ్ఞాత వ్యక్తి చిరు మందహాసంతో చేతులు చాచి తనను అవహానిస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడు అతడి వేషధారణ ఒక యోగిలా ఉంది అతడు మహా పురుషుడులా కనిపిస్తున్నాడు. ఆ రహస్యమైన యోగి ఆ యువకుడిని వచ్చావా లహరి ఇప్పుడిక ఈ గుహలో విశ్రాంతి తీసుకో నేను నిన్ను పిలిచాను అని అన్నాడు ఆ మాటలు ఇతడికి అద్భుతంగా వినిపించాయి. ఆ పర్వతానికి వెళ్లిన ఆ యువకుడి పేరు లహరి తన మనసులో ఇలా అనుకున్నాడు యోగికి తన పేరు ఎలా తెలుసు ఇంతకు ముందున్నడు నేను అతడిని కలవనే లేదు అసలు చూడనే లేదు ఆ గుహ చుట్టూ పరికించి చూడగా ఆ గుహ చాలా పరిశుభ్రంగా ఉంది అక్కడ కొన్ని ఉన్ని దుప్పట్లు ఉన్నాయి. ఆ రహస్యమైన యోగి ఒక దుప్పటిని చూయిస్తూ నువ్వు ఈ ఆసనాన్ని గుర్తించావా లహరి అని అన్నాడు అప్పుడు లహరి నాకు వీటి గురించి ఏమీ తెలియదు రాత్రి అయ్యేలా ఉంది నేను త్వరగా తిరిగి వెనక్కి వెళ్ళాలి అన్నాడు రేపు ఉదయం ఆఫీసులో చాలా వరకు ఉంది అన్నాడు అతడి మాటలు విన్న సాధువు ఆఫీసుని మీకోసం ఇక్కడికి తీసుకురాబడింది అని మర్మమైన సాధువు సమాధానం ఇచ్చాడు. లహరికి ఇది అర్థం కాలేదు అతను ఆ సాధువుతో దీని అర్థం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు ఇలా సమాధానం ఇచ్చాడు మిమ్మల్ని రానికెడుకు బదిలీ చేయాలని అధికారి మనసులోఆ ఆలోచన కలిగేలా నేనే చేశాను అని చెప్పాడు.
అది మాత్రమే కాదు ఈ గుహను నువ్వు గుర్తుపట్టావా అని శ్యామ్చరణ్ లహరిని అడిగాడు లహరికి ఏమనాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు అప్పుడు ఆ రహస్యమైన యోగి లహరి వద్దకు వచ్చి అతని నుదుటిని సున్నితముగా తాకి మృదువుగా నీమీరాడు అతని అద్భుత స్పర్శ మెదడులో మర్మమైన ప్రవాహ తరంగాలు ఉత్పన్నమైనట్లు మరియు అతను చాలా విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం ప్రారంభించాడు. గత జన్మలోని తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి లహరికి వెంటనే అర్థమయిపోయింది ఇతను మరెవరో కాదు నా గురువు బాబా మరియు ఇది నేను చాలా సంవత్సరాలు సాధన చేసిన గుహ అని వందేళ్లకు పైగా నీకోసం ఎదురు చూస్తున్నాను అని మర్మమైన యోగి అన్నాడు. నువ్వు నన్ను చూడలేవు కానీ నా కళ్ళు ఎప్పుడు నీ మీదే ఉన్నాయి నిన్ను అన్వేషిస్తూనే ఉన్నాయి నువ్వు మీ తల్లి కడుపులో ఉండగా నియత సమయంలో జన్మించిన కూడా నా కళ్ళన్నీ ఎప్పుడూ నీ మీదే ఉన్నాయి నువ్వు చిన్నప్పుడు నదీ తీరాన ఇసుకలో ఆడుకునే సమయంలో కూడా నేను కనిపించని రూపంలో అక్కడే ఉన్నాను. శుభదినం కోసం నేను వందల సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను ఇప్పటికి నువ్వు నా వద్దకు వచ్చావు ఇది నీకు ఇష్టమైన గుహ నేను నిత్యం శుభ్రంగా ఉంచాను. ఇది నీ పవిత్రమైన పద్మాసనం వేసిన చోటు నువ్వు ప్రతిరోజు ధ్యానం చేసే వాడివి నువ్వు నేను తయారుచేసిన ఔషధ రసాన్ని తాగే ఇత్తడి గిన్నె ఇదే చూడు దీనిని ఎంతలా ఎంతలా మెరిసిపోతుందో ఇకనుండి నువ్వు దీనిని ఉపయోగించబోతున్నావు కుమారా నీకు ఇప్పుడు అంతా అర్థమైందా అని అడిగాడు.
లహరి సంతోషంలో మునిగిపోయాడు పాత్రలో ఉంచిన ఔషధాన్ని తాగి నది ఒడ్డున విహరించి వెళ్లి పడుకోమని బాబా అతనిని ఆజ్ఞాపించాడు ఆరోజు రాత్రి చాలా చల్లగా ఉంది బాబా ఆజ్ఞ ప్రకారం ఔషధం త్రాగిన తర్వాత అతని శరీరంలో అహల్లాదకరమైన వెచ్చదనం ప్రసరించడం ఆరంభమైంది చుట్టు ప్రక్కల చీకట్లో చలిగాలు అతడిని తాకుతూ ఉన్నాయి. నదికి దగ్గరలో ఉన్న కొండ అంచున పడుకుని ఉన్నాడు ఆ ప్రదేశం చాలా అహ్లాదకరంగా ఉంది ఆ సమయంలో ఒక జ్ఞాని అడుగుజాడలు వినపడగా అతని దృష్టి మరలింది అప్పుడు ఆ చీకటిలో ఎవరో అతనిని పట్టుకొని పైకి లేపి కొత్త వస్త్రాలు ఇచ్చి నాతో రా గురుదేవుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని అన్నాడు. ఇద్దరూ ఆ దారి గుండా వెళ్లడం ప్రారంభించారు ఒక మలుపు దగ్గర లహరికి ఒక కొత్త కాంతి కనిపించింది. అప్పుడు లహరి సూర్యోదయం అయ్యిందా అని అడిగాడు లేదు ఇది అర్ధరాత్రి ఆ కాంతిని మహాపురుషుడైన బాబాగారు ఏర్పాటు చేశారని అక్కడ మీరు క్రియ యొక్క దిశను పొందుతారని చెప్పాడు కొంత సమయం తర్వాత లహరికి మహా అవతార్ బాబా యొక్క శబ్దం వినిపిస్తుంది మేలుకో లహరి నీ కోరికలన్నీ శాశ్వతంగా నాశనం అవ్వబోతున్నాయి ప్రపంచంలో అశాంతి పెరుగుతుంది క్రియాయోగం ద్వారా వ్యాకుల పడిన భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించడానికి మీరు ఎంపిక చేసి అవతరింపబడ్డారు కుటుంబ బంధాలు మరియు ప్రాంధిక విధులతో భారమైన వ్యక్తులు గృహస్తులు క్రియాయోగ జ్ఞానాన్ని పొందిన తర్వాత కొత్త ఆశను పొందుతారని గృహ బాధ్యతల ద్వారా యోగ యొక్క అత్యున్నత విజయాలు నెరవేరబడతాయని ఇప్పుడు మీరు అలాంటి రహస్యాలను బహిర్గతం చేస్తారని ఆ విజయం గృహస్థుడు కూడా పొందవచ్చని మహా అవతార్ బాబా లహరి ముందు చెప్పాడు. మహా అవతార్ బాబా లహరి ముందు స్వర్ణ మహల్ అంటే బంగారు మహల్ ను సాక్షాత్కరింపజేశారు మీ పూర్వ జన్మలో మీరు హిమాలయ పర్వతాలపై ఉన్నారు అప్పుడు స్వర్ణ మహలను ఊహించుకున్నారని మరియు ఇది మీ ఊహా యొక్క రూపమని చెప్పారు జ్ఞానాన్ని పొందిన లహరికి ఈ బంగారం వెండి వజ్రాలు, ముత్యాలు ఏమీ అవసరం లేదు అందుకని ఆ బంగారు మహల్ చూస్తుండగానే అదృశ్యం అయింది.
శ్యామ్ చరణ్ బాబా లహరికి క్రియాయోగం ద్వారా ప్రజల జీవిత ప్రమాణాల్ని మెరుగుపరిచారు అతడు తన జీవితంలో ప్రజల ముందు అనేక అద్భుతాలు చేశాడు ప్రజలు పరమానందం పొందేలా తన ప్రాపంచిక జీవితం సుఖసంతోషాలతో ఉండేలా కృషి చేశాడు మహా అవతార్ బాబా అప్పుడప్పుడు ఆయన్ని సందర్శించేవారు క్రియాయోగం పునరుద్ధరింపబడడం ద్వారా ప్రజల జీవన ప్రజల జీవనాన్ని మెరుగుపరిచిన అవతార పురుషుడు శ్యామ్చరణ్ లహరి బాబా. ఇలా మన వేద భూమిలో ఎందరో ప్రముఖమైన వ్యక్తులు ఋషులు మార్శులు, ప్రజా శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేశారు ఈ అద్భుతమైన సాధువు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి