Best Telugu News Portal.

ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల అసెంబ్లీలు.

0

నేనే రాజు.. నేనే మంత్రి: ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటూ ఒక ప్రముఖ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

andhra pradesh and telangana assembly

తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశకాలం వరకూ సస్పెండ్ చేయగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు కౌన్సిల్ ఛైర్మన్‌ను గాయపరచారని వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రా లో గత సంవత్సరం నుంచి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం హాజరు కావడంలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంలేదనే కారణంతో వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు.

కారణాలేవైనప్పటికీ ప్రతిపక్షం ఉంటే ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తుందనే భయంతో రెండు రాష్ట్రాల్లోనూ వారిని లేకుండా చేసినట్టు స్పష్టమవుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగావున్న వైసీపీతో పాటు మొన్నటివరకు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ని బీజేపీ కూడా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నది.

అయితే వారి సంఖ్యాబలం తక్కువ కావడంతో టీడీపీ పెద్దగా భయపడటంలేదు. తెలంగాణలోకూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకపోవడంతో బీజేపీ, టీడీపీ, సిపిఐ(యం) సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వీరి సంఖ్యాబలం కేవలం 8 మాత్రమే.. అని నవతెలంగాణ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

Comments
Loading...