Best Telugu News Portal.

రాష్ట్ర బడ్జెట్ : 2018 ఉద్యోగ నామ సంవత్సరం.

0

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఒక లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

telangana budget for jobs in 2018

ప్రభుత్వం ఇప్పటి వరకు 83వేల 048 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పలు దశలవారీగా ఆయా శాఖలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా నోటిఫికేషన్లు ద్వారా నియామకాలు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు.

అందులోభాగంగానే ఇప్పటి వరకు 27వేల 588 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు తెలిపారు. వీళ్లందరూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మిగతా ఉద్యోగాలన్నీంటినీ ఈ ఏడాది భర్తీ చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Also Read:     ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నపవన్ కళ్యాణ్,   గిరిజన యువకుడిని చంపింది ఆకలా? సమాజమా?  and   ఆధార్ లింకింగ్‌ తప్పనిసరికాదు: సుప్రీంకోర్టుతీర్పు..

Comments
Loading...