Best Telugu News Portal.

ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నపవన్ కళ్యాణ్

0

ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష: ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష మరియు బలిదానానికి సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

pawan kalyan on special status

ఆంధ్రా కి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష:

ఇది తనమనుసులో ఎప్పటి నుంచో ఉందన్నారు. అలాగే యువతను పోరాటాలు చేయటానికి పిలువనని తెలిపారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై తన నిర్ణయం చెప్పి తీరాలని కూడా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేసి తీరాలని పవన్  డిమాండ్ చేశారు. అలాగే తన ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడితే ఏం జరుగుతుందో అది మాత్రం తన చేతిలో ఉండదని హెచ్చరించాడు పవన్ కళ్యాణ్.

ఆంధ్రాని కరప్షన్ ఆంధ్రాగా మార్చారు – పవన్ కల్యాణ్

జనసేన ఆవిర్భావ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీలో పవన్ మాట్లాడుతూ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ (జనసేన అదినేత) విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు కరప్షన్ ఆంధ్రా చేశారని పేర్కొన్నారు.

లోకేష్ అవినీతి  మీ దృష్టికి వచ్చిందా లేదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అంతే కాదు తెలిసే లోకేష్ తో కరప్షన్ చేయిస్తున్నారా అని అన్నారు. కరప్షన్ చేస్తామని బహిరంగంగా చెబుతున్నారట. ఎన్నికల్లో వైఎస్ జగన్ ని ఎదుర్కోవాలంటే డబ్బులు కావాలని లోకేష్ అంటున్నారట. ఇంత అవినీతి ఏమిటి అని ప్రశ్నించారు. మీరు చేస్తున్న దోపిడీ చూస్తూ ఊరుకోవడానికి 2014 లో మీకు మద్దతు ఇవ్వలేదు అన్నారు.

మీరు ఇలాగే చేస్తే 2019 లో కొత్త నాయకులను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని కరప్షన్  ఏపీలో లో ఉందన్నారు. మన డబ్బును దోచుకునే వారిని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలన్నారు. అంతే కాదు .. 2019 లో మీకెందుకు సపోర్టు చేయాలి అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు మీకైతే అంత సుఖంగా ఉండన్నారు.

Comments
Loading...