Best Telugu News Portal.

చరిత్రలో అత్యంత ధనికుడు ఇతడే! నిజాం నవాబూ కాదు, బిల్ గేట్స్ కాదు.

0

కొన్ని వార్తా పత్రికలో కథనాలు చరిత్రలో అత్యంత ధనికుడు లాంటి పదాలతో ప్రారంభం అవుతాయి. మొదటి మన్సా మూసా సుల్తాన్ (1280-1337) గురించి కూడా ఇలాగే చెప్పొచ్చు. ఇతను మూసా మాలి సామ్రాజ్యాన్ని పాలించారు ఆ సమయం లో అనేక బంగారు గనులు ఆయన ఆధీనంలో ఉండేవి అని తేలింది.

Musa I of Mali

మొదటి మన్సా మూసా సుల్తాన్ కాలంలో బంగారానికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉన్నది. అతని నిజమైన పేరు మొదటి మూసా కీటా. కానీ సింహాసనంపై కూర్చోవడంతో ఆయన పేరు మన్సాగా మారింది. మన్సా అన్న పదానికి రాజు అని అర్థం వస్తుంది. మన్సా మూసా సామ్రాజ్యం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే, దాని సరిహద్దులు అంతుచిక్కేవి కావు. నేటి మారిటానియా, సెనెగల్, జాంబియా, గినియా, బుర్కినా ఫాసో, మాలి, నైగర్, చాద్, నైజీరియాలు నాడు మూసా సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. మన్సా మూసా నిర్మించిన మసీదులు ఇప్పటికీ ఉన్నాయి.

Also Read:

మొదటి మన్సా మూసా సుల్తాన్ (1280-1337) సంపద ఎంత?

మొదటి మన్సా మూసా సుల్తాన్ సంపదను నేటి లెక్కల్లో అంచనా వేయాడం చాలా కష్టం. అంచనా ప్రకారం అతని సంపద భారత కరెన్సీ ప్రకారం సుమారు 25 లక్షల కోట్లు. ఇటీవల అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ని ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ప్రకటించారు. అతని సంపద సుమారు 6.7 లక్షల కోట్లు. మన్సా మూసా సంపద జెఫ్ బెజోస్ సంపదకన్నా చాల ఎక్కువ.

1324లో జరిగిన మన్సా మూసా మక్కా యాత్ర కథనం ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ మక్కా యాత్ర సుమారుగా 6 వేల కిలోమీటర్లు సాగిందని చరిత్ర చెపుతుంది. ఆయన వెళ్లే దారిలో ఆయనను దర్శించుకోవాలనుకున్న ప్రజలు, ఆయన వెంట ఉన్న పరివారాన్ని చూసి ఆశ్చర్యం చెందేవారు. మన్సా మూసా వద్ద సుమారుగా 60 వేల మంది సైన్యం ఉండేవారు ఇందలో సుమారు 12 వేల మంది మూసా సుల్తాన్ వ్యక్తిగత సహాయకులు.

Musa I of Mali place

సుమారు 500 మంది గుర్రాలపై స్వారీ చేస్తుండేవారు మన్సా మూసాకు ముందు, మరియు వారి చేతుల్లో బంగారు కర్రలుండేవి. ఈ 500 మంది అత్యంత ఖరీదైన వస్త్రాలు ధరించేవారు. దాంతో పాటు ఆయన వద్ద 80 ఒంటెల బృందం ఉండేది దాని మీద 136 కిలోల బంగారం ఉండేది.

మూసా చాలా ఉదారుడు చాలా దానధర్మాలు చేసేవాడు, ఆయన ఈజిప్టు రాజధాని కైరో గుండా ప్రయాణించేటప్పుడు, అక్కడున్న పేదలకు ఆయన చేసిన దానాలతో ఆ ప్రాంతంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అంటారు. మన్సా మూసా మక్కా యాత్రతో ఆయన సంపద గురించిన వార్తలు యూరప్ ప్రజల చెవినబడ్డాయి. ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి అనేక మంది యూరోపియన్లు ఆయనను సందర్శించేందుకు వచ్చేవారు.

ఆయన సంపద నిజమేనని నిర్ధారించుకున్న అనంతరం మాలి సామ్రాజ్యాన్ని ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్న కేటలాన్ అట్లాస్‌లో చేర్చారు. 14వ శతాబ్దపు కేటలాన్ అట్లాస్‌లో యూరోపియన్లు తమకు తెలిసిన అన్ని ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించేవారు. మూసా 1337లో మరణించారు, సుమారు 25 ఏళ్ల పాటు ఆయన పాలించారు.

మిచిగాన్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రుడాల్ప్ వైర్ ‘మనీ’ పత్రికతో మాట్లాడుతూ.. ”ఇది చరిత్రలో అత్యంత ధనికుడైన వ్యక్తికి సంబంధించిన విషయం. మీకు ఎంత సంపద ఉందో అంచనా వేయటం కూడా అసాధ్యమే అవుతుందో, అప్పుడు మీరు అత్యంత ధనికుడి కింద లెక్క” అంటారు.

Comments
Loading...