Best Telugu News Portal.

సెల్‌ఫోన్లతో ప్రమాదం ఎంత? సెల్ఫోన్ రేడియేషన్ వలన కేన్సర్ వస్తుందా?

0

Cellphone Radiation: సెల్ల్ఫోన్లు మరియు వాటి ప్రభావం: ప్రస్తుతం ఈ అంశం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ వాటికి సమాధానాలే దొరకడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా మన శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయం చేసినా కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు.

Cellphone radiation: సెల్‌ఫోన్లతో ప్రమాదం ఎంత? సెల్ఫోన్ రేడియేషన్ వలన కేన్సర్ వస్తుందా?

cellphone radiation

రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్‌ను కలిగి ఉంటాయి. కానీ ఈ తరంగాలు.. ఎక్స్-రే, అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి వెలువడే ఐయొనైజింగ్ రేడియేషన్ కంటే తక్కువ ప్రభావం కలిగివుంటాయి. సెల్‌ఫోన్ల వాడకం.. తల, మెడ, మెదడు భాగాల్లో కేన్సర్ కణతులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందా? అన్న అంశాన్ని అమెరికన్ కేన్సర్ సొసైటీ వివరించింది.

అమెరికన్ సొసైటీ ప్రకటనలో మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తరంగాలు DNA ని నేరుగా దెబ్బతీసేంత తీవ్రంగా ఉండవని, శరీరంలోని కణజాలాన్ని వేడికి గురిచేయలేవని వివరించారు. అంతేకాకుండా సెల్‌ఫోన్ల రేడియేషన్ నుంచి కేన్సర్ ఏవిధంగా వస్తుందో అన్న అంశంలో కూడా స్పష్టత లేదు. సెల్ల్ఫోన్ల వలన కేన్సర్ వస్తుందన్న వాదనను చాలా అధ్యయనాలు బలపరుస్తున్నాయి, కానీ వాటిలో కూడా ఎలాంటి ఆధారాలూ లేవు.

ఏఏ ఫోన్ల నుంచి ఎక్కువ రేడియేషన్ వెలువడుతుంది? Specific absorption rate (SAR):

Specific absorption rate (SAR) ద్వారా రేడియేషన్ ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు. Specific absorption rate (SAR) విలువని తెలుసుకొనుటకు *#07# ఎంటర్ చేయని మీ సెల్ ఫోనులో. ప్రతి సెల్‌పోన్‌కూ ఈ S.A.R ప్రమాణం ఉంటుంది. తయారీ సంస్థలు కూడా వారి కంపెనీ ఉత్పత్తుల ఎస్.ఎ.ఆర్ స్థాయిలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు ముందుగానే తెలపాలి. అయితే చాలా మంది వినియోగదారులకు ఈ అంశం పట్టించుకోరు.

ఫోన్లను కొంటున్నపుడు, వాడుతున్నపుడు ముందుగా S.A.R ని చూసుకోవాలి. జర్మనీలోని రేడియేషన్ ప్రొటెక్షన్ కార్యాలయం.. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఎక్కువగా వెలువరించే ఫోన్ల జాబితాను తయారుచేసి, ప్రజలకు అందుబాటులో ఉంచింది.

ఇదే ఆ ఫోన్ల జాబితా!!

ఈ జాబితాలో వన్ ప్లస్, హువాయ్ లాంటి చైనా కంపెనీలు, నోకియా, మైక్రోసాఫ్ట్ లుమియా 630 ఫోన్లు అగ్రభాగంలో ఉన్నాయి. జాబితాలో ఐఫోన్ 7 పదో స్థానంలో, ఐఫోన్ 8 పన్నెండవ స్థానంలో, ఐఫోన్ 7 ప్లస్ పదిహేనవ స్థానంలో ఉన్నాయి. ఇక సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్-1 కాంపాక్ట్ 11వ స్థానంలో, బ్లాక్‌బెర్రీ డి.టి.ఇ.కె. 60 14వ స్థానాల్లో ఉన్నాయి.

అయితే టెలిఫోన్ రేడియేషన్‌కు సంబంధించి ఎటువంటి అంతర్జాతీయ ప్రమాణాలూ లేవు. కానీ జర్మనీ ప్రభుత్వం మాత్రం, రేడియేషన్ స్థాయి 0.60 వాట్స్/కిలోగ్రామ్‌కు మించని ఫోన్లకు అనుమతులు ఇస్తుంది. అయినాకానీ జర్మన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో అన్ని ఫోన్లు 0.60 వాట్స్/కిలోగ్రామ్‌ కంటే రెట్టింపు స్థాయిని కలిగివున్నాయి. వీటిలో వన్ ప్లస్ 5టి (1.68) మొదటి స్థానంలో ఉంది.

తక్కువ రేడియేషన్ వెలువరించే పోన్ల జాబితాలో సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5 (0.14), సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (0.17) ఎస్6 ఎడ్జ్ ప్లస్ (0.22), గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ (0.25), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (0.26), ఎస్7 ఎడ్జ్ (0.26) ఉన్నాయి. జర్మన్ సంస్థ ప్రకారం.. అమెరికన్ మోటొరోలా కంపెనీకు చెందిన మోటో జీ5 ప్లస్, మోటో జడ్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలకు మనం ఎలా గురవుతాం?

ఫోన్ లోపల పొందుపరచిన యాంటెనా వద్ద ఈ తరంగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి తలను దగ్గరగా ఉంచినపుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కింది విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. గమనించండి. అమెరికన్ కేన్సర్ సొసైటీ.. ఇలా చేయమని చెబుతోంది..

  • ఫోన్లో మాట్లాడేటపుడు దాదాపుగా స్పీకర్, లేదా హెడ్ ఫోన్స్ వాడాలి.
  • బ్లూ టూత్‌ను తరచూ వాడే వారికి ఇది మరీ అవసరం.
  • మెసేజ్‌లను ఎక్కువగా ఉపయోగించి, వీలయినన్ని తక్కువ కాల్స్ చేయాలి.
  • డ్రైవింగ్‌ చేస్తున్నపుడు సెల్‌ ఫోన్ వాడకం తగ్గించడం.
  • ఎస్.ఎ.ఆర్ స్థాయి తక్కువగా ఉన్న ఫోన్ల వాడకం.

Comments
Loading...